పెషావర్: పాకిస్థాన్‌లోని కైబర్ పఖ్తుఖ్వా ప్రావిన్స్‌లో గురువారం ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. దాదాపు 200 ప్రయాణికుల వాహనాలపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 50 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. ఈ సంఘటన పెషావర్-పరచినార్ మార్గంలో, కుర్రమ్ గిరిజన జిల్లాలో జరిగినట్లు ఈ ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ నదీమ్ అస్లాం చౌదరి తెలిపారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదుగురు బాలలు ఉన్నారని చెప్పారు. మృతుల్లో అత్యధికులు షియా ముస్లింలని అధికారులు తెలిపారు. స్థానిక పాత్రికేయుని కథనం ప్రకారం, తాలిబన్ల ప్రాబల్యం గల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అఫ్గానిస్థాన్‌కు సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలోని భూమిపై సున్నీ, షియా ముస్లింల మధ్య దశాబ్దాల నుంచి ఘర్షణ జరుగుతున్నది.