గద్వాల, అక్టోబర్ 13 : బీఆర్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్త ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీదొడ్డి మండలం కుచినెర్ల గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు 50మంది బీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ప్రతి ఇం టికీ ఏదో ఒక రూపంలో సంక్షేమ పథ కం అందిందన్నారు. లబ్ధిదారులు బీఆర్ఎస్కు అండగా నిలవాలని కోరారు. ప్రతిపక్షాలకు అధికారం ఇస్తే రాష్ట్రం అభివృద్ధిలో మరో వందేళ్లు వెనక్కి పోతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అమలు కాని వాగ్ధానాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారి మాటలు నమ్మి ఓటు వేస్తే గోస తప్పదన్నారు. పేదవారికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాలంటే రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ను ఆదరించాలన్నారు. ప్రతిపక్షాలు చెప్పే కల్లిబొల్లి మాటలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. కార్యక్రమం లో రైతుసంఘం అధ్యక్షుడు చెన్నయ్య, నాయకులు వెంకటేశ్, బ్రహ్మయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఎమ్మెల్యే..
పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకూ ఎమ్మె ల్యే కృష్ణమోహన్‌రెడ్డి అండగా ఉంటాడ ని ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి అన్నారు. క్యాంప్ కార్యాలయంలో మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు 40మంది బీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్యే సతీమణి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జునరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు వినతి
జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మత్స్యకార సంఘం అధ్వర్యంలో ఎమ్మె ల్యేకు వినతిపత్రం అందజేశారు. గద్వాల మండలంలోని నదీ పరివాహక ప్రాంతాలైన రేకులపల్లి, కొత్తపల్లి, చెనుగోనిపల్లి, నదీ అగ్రహారం, ముల్కలపల్లి, తెల్గోనిపల్లి, బీరెల్లి, గుర్రంగడ్డ సొసైటీల పరిధిలోని మత్స్యకారులు నదిలో చేపల పడుతూ జీవిస్తున్నారు. ఈక్రమంలో ఇతర కులస్తులు నదిలో చేపల వేట కోసం లైసెన్స్ అనుమతి పొందడానికి ప్రయత్నిస్తున్నారని, అలా చేయొద్దని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దౌలు, లక్ష్మన్న, బీచుపల్లి, శాలన్న, రమేశ్, నర్సింహులు, గోవిందు, సురేశ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాలకు మీరే బుద్ధిచెప్పాలి
ప్రభుత్వం అం దించిన పథకాలన్నీ మీ చెంతకు చేరాయి కాబట్టి ఎన్నికల ప్రచారంలో మీరే ఆ పథకాలకు ప్రచారకర్తలుగా వ్యవహరించి మరోసారి బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే సతీమణి జ్యోతి ఈనెల15వ తేదీ నుంచి చేపడుతున్న ఇంటింటికీ బీఆర్ఎస్ కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని కోరుతూ మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మె ల్యే పాల్గొని పార్టీ విజయం కోసం నడుచుకోవాల్సిన విధానాలపై పలు సూచన లు చేశారు. కేసీఆర్ విజయం కోసం 45 రోజులు కష్టపడదాం, ఐదేండ్లు ఆయన నీడలో చల్లగా బతుకుదామని అన్నారు. అదివారం నుంచి జ్యోతమ్మ చేపట్టబో యే కార్యక్రమంలో ముందుండి నడిపించాలని కోరారు. చేసిన అభివృద్ధిని ధై ర్యంగా వెళ్లి ప్రజలకు వివరించాలని, ప్ర తిపక్షాల ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. సమావేశంలో పౌగుంట ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్, నాయకులు వెంకట్రాములు, శ్రీ నివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.