అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై ఓటర్లు చాలా ఆగ్రహంగా ఉన్నారని, ఈ కోపమే తమ కూటమికి 400 సీట్లు ఇస్తుందని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ వ్యాఖ్యానించారు. హత్రాస్ ఘటనలో యోగి ప్రభుత్వంపై దుయ్యబట్టారు. సామూహిక లైంగికదాడికి గురైన 16 ఏండ్ల బాలికకు సరైన చికిత్స అందించడంలో యోగి ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఆ అమ్మాయి మరణించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై జరిగిన కాల్పులే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.