భువనగిరిలో వెలుగులోకి..
భువనగిరి అర్బన్, మార్చి 5 : రియల్ ఎస్టే ట్ పేరుతో దాదాపు రూ.400 కోట్ల మోసానికి పాల్పడిన ఘటన భువనగిరి పట్టణంలో వెలుగులోకి వచ్చింది. పలువురు బాధితులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరికి చెందిన మహ్మద్ షాకీర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. రియల్ ఎస్టేట్‌లో డబ్బులు బాగా సంపాదించవచ్చని కువైట్‌లో స్థిరపడ్డ తన స్నేహితుడైన అబ్దుల్ రహమాన్‌ను నమ్మించాడు. మొదట కొంత మొత్తంలో తీసుకొన్న డబ్బుకు ప్లాట్లు, భూములు అతని పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. ఆ తరువాత సుమారు రూ.30 కోట్లను రహమాన్‌తోపాటు వారి సోదరుల వద్ద తీసుకొన్నాడు. అంతేకాకుండా వరంగల్, నల్లగొండ, ఖమ్మం, యాదాద్రి భు వనగిరి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన స్నేహితులను నమ్మించి ఒక్కో కుటుంబం వద్ద రూ. లక్ష నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేశా డు. మొత్తం 500 మంది వద్ద దాదాపు రూ. 400 కోట్ల వరకు తీసుకొన్నాడని బాధితులు చెప్తున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫి ర్యాదు చేశారు. అయితే షాకీర్.. కువైట్ నుంచి వచ్చిన రహమాన్ డబ్బుల విషయమై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకొన్నారు.