ముంబై: మహారాష్ట్ర (Maharashtra)లోని థానే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Thane Accident) జరిగింది. కారు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు (Heart Attack) రావడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో కారు డ్రైవర్ సహా నలుగురు మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

శుక్రవారం రాత్రి థానే (Thane) జిల్లాలోని అంబర్నాథ్ (Ambarnath) టౌన్లో ఫ్లైఓవర్‌పై (Flyover) ఈ ఘటన చోటుచేసుకున్నది. శివసేన పార్టీకి చెందిన స్థానిక ఎన్నికల అభ్యర్థి కిరణ్ చాబే ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అంబర్నాథ్ ఫ్లైఓవర్‌పై నుంచి వెళ్తుండగా కారు డ్రైవర్ లక్ష్మణ్ షిండే గుండెపోటుకు గురయ్యారు. దీంతో వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్‌లు, ఇతర వాహనాలను ఢీకొట్టింది. అనంతరం బోల్తాపడింది. కారు వేగంగా ఢీకొట్టడంతో ఓ వ్యక్తి బైక్‌తో సహా ఎగిరి ఫ్లైఓవర్ కింద పడ్డారు. కారు డ్రైవర్ షిండేతోపాటు మరో ముగ్గురు మృతిచెందారు. ప్రమాదం కారణంగా పలు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఉన్న కిరణ్ చాబేను స్థానికుల బయటకు తీసి దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ప్రమాదానికి సంబంధించిన దృష్యాలు రికార్డయ్యాయి.