Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లో బిజీగా ఉండగా, తాజాగా జిమ్‌లో తీసుకున్న ఫోటోలు షేర్ చేయగా, అవి నెట్టింట్లో సందడి సృష్టిస్తున్నాయి. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వర్కౌట్ ఫోటోలో ఆమె బ్యాక్, ఆర్మ్స్ మసిల్స్‌ను ఫ్లెక్స్ చేస్తూ, తన అద్భుతమైన ఫిట్నెస్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను చూపించారు. గ్రే స్ట్రాపీ స్పోర్ట్స్ బ్రా, నేవీ లెగింగ్స్, వైట్ స్నీకర్స్‌లో ఆమె అథ్లెటికల్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కొద్ది గంటల్లోనే ఈ ఫోటోకు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంది.. ‘‘ఇంత స్ట్రాంగ్ లుక్ ఎన్నడూ చూడలేదు’’, ‘‘సామ్ ఈజ్ బ్యాక్’’ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కొన్నాళ్ల క్రితం సమంత మయోసైటిస్ బారిన పడి చాలా వీక్ అయింది. క్రమంగా కోలుకుంటూ వచ్చిన సమంత ఇప్పుడు ఫుల్ స్ట్రాంగ్ అయింది. ఇటీవల సమంత OTT రేంజ్ కూడా క్రమంగా పెరుగుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ 3’ సూపర్ సక్సెస్ అవడంతో, ఆమె ఇందుకు సంబంధించిన ఆనందాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పంచుకున్నారు. సీజన్‌కు వచ్చిన 4-స్టార్ రివ్యూలను షేర్ చేస్తూ, “ఇలాంటి పాజిటివ్ రివ్యూలు చాలా రోజుల తర్వాత చూస్తున్నా” అని పేర్కొన్నారు. సమంత ఈ సిరీస్‌లో సీజన్ 2లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కొత్త సీజన్లో కథనం, ఎమోషన్, రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌ను రాజ్ & DK టీమ్ హైలైట్ చేసిన విధానాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
‘ది ఫ్యామిలీ మాన్ 3’ ప్రేక్షకులు, విమర్శకుల నుంచి భారీగా ప్రశంసలు అందుకుంది. హై-ఇంటెన్సిటీ డ్రామా, నాటకీయమైన యాక్షన్, నేచురల్ పర్ఫార్మెన్స్లతో ఈ ఫ్రాంచైజీ మరోసారి తన రేంజ్‌ను నిరూపించింది. ఇక ఫిట్నెస్ ఫోటోతో పాటు OTT విజయంతో సమంత మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమె హవా కొనసాగుతూనే ఉంది. అభిమానులు ఇప్పుడు ఆమె నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో పాటు మరిన్ని కొత్త ప్రాజెక్టులు, ఆమె తదుపరి ఫిట్నెస్ గోల్స్ ఏంటా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.