గౌహతి: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. గౌహతి వేదికగా ఆ మ్యాచ్ ప్రారంభమైంది. ఫస్ట్ టెస్టులో సఫారీలు 30 రన్స్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. శుభమన్ గిల్ గాయపడడంతో ఈ మ్యాచ్‌లో ఇండియాకు రిషబ్ పంత్ సారధ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇండియా జట్టులో రెండు మార్పులు జరిగాయి. బీ సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డిలను తీసుకున్నారు. అక్షర్ పటేల్ స్థానంలో నితీశ్‌ను తీసుకున్నారు. దక్షిణాఫ్రికా జట్టులో ఓ మార్పు జరిగింది. కార్బిన్ బాస్చ్ స్థానంలో సెనురన్ ముత్తుస్వామిని తీసుకున్నారు.
🚨 Toss 🚨#TeamIndia have been asked to bowl first
Updates ▶️ https://t.co/Wt62QebbHZ#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/isE64twdaB
— BCCI (@BCCI) November 22, 2025
గౌహతి వేదిక టెస్టు మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా.. బెల్‌ను కొట్టి గౌహతి టెస్టు మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లకు గోల్డ్ ప్లేట్ టాస్ కాయిన్లను అందజేశారు. గౌహతి స్టేడియంకు చెందిన పోట్రేట్పై రిషబ్ పంత్, టెంబా బవుమాలు సంతకం చేశారు.
A moment to cherish! 🙌
BCCI Honorary Secretary Mr. Devajit Saikia presents the two captains with Memorial gold-plated toss coins to mark the inaugural Test in Guwahati! 👏
Rishabh Pant and Temba Bavuma also signed a special ACA Stadium portrait to honour the occasion.
Updates… pic.twitter.com/mPLFMxi1Yo
— BCCI (@BCCI) November 22, 2025
తాజా సమాచారం ప్రకారం సౌతాఫ్రికా 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 రన్స్ చేసింది. మార్క్రమ్, రికల్టన్ క్రీజ్‌లో ఉన్నారు.