చంఢీఘడ్: సీఎం భగవంత్‌మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. ప్రతి ఇంటికి జూలై ఒకటో తేదీ నుంచి 300 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇవ్వనున్నట్లు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇవాళ ఆ రాష్ట్రంలో అనేక పత్రికల్లో ప్రచురితమైన వాణిజ్య ప్రకటనల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఇవాళ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ తన మ్యానిఫెస్టోలో 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 16వ తేదీన గుడ్‌న్యూస్‌ను వెల్లడించనున్నట్లు సీఎం భగవంతమాన్ గురువారం ఓ కార్యక్రమంలో పేర్కొన్న విషయం తెలిసిందే. పంజాబ్ ప్రభుత్వం రైతులకు ఇప్పటికే ఉచిత కరెంటు ఇస్తోంది. ఎస్సీలు, బీసీలు, నిరుపేద ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తోంది.