హైదరాబాద్, జనవరి 20(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంగళవారం రూ. 262.51 కోట్లు విడుదల చేసినట్టు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. ఈ మొత్తాన్ని ఆధార్ నంబరు ఆధారంగా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈవారం చేసిన చెల్లింపుల్లో బేస్మెంట్ స్థాయి నిర్మాణపు పనులను పూర్తి చేసిన లబ్ధిదారులు 2763 మంది, గోడలు-శ్లాబ్ కట్టడాల స్థాయి దాటిన వారు 20,186 మంది ఉన్నారని తెలిపారు.