DCW vs MIW | జెమీమా కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబైని 7 వికెట్ల తేడాతో ఓడించిన ఢిల్లీ..!
DCW vs MIW : మహిళల ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన ఢిల్లీ క్యాపిటల్స్ వడోదరలో గర్జించింది. మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసిన ఢిల్లీ.. ఛేదనలో చెలరేగింది.
DCW vs MIW : మహిళల ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన ఢిల్లీ క్యాపిటల్స్ వడోదరలో గర్జించింది. మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసిన ఢిల్లీ.. ఛేదనలో చెలరేగింది. ఓపెనర్ లిజెల్లీ లీ(46), షఫాలీ వర్మ(29) విధ్వంసక ఆటతో బలమైన పునాది వేయగా.. జెమీమా రోడ్రిగ్స్(51 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. మరిజానే కాప్(10 నాటౌట్)తో కలిసి ఢిల్లీని గెలిపించిం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచింది.
మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయం నమోదు చేసింది. ఉత్కంఠ పోరులో సమిష్టిగా రాణించిన ఢిల్లీ.. మరో ఓవర్ ఉండగానే మంబై ఇండియన్స్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ప్రత్యర్ధి ముంబై నిర్దేశించిన ఛేదనను ఢిల్లీ ఓపెనర్లు దూకుడుగా మొదలెట్టారు. లిజెల్లీ లీ(46), షఫాలీ వర్మ(29)లు బౌండరీలతో చెలరేగుతూ ముంబై బౌలర్లను ఒత్తిడిలో పడేశారు. తొలి వికెట్‌కు 63 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని వైష్ణవీ శర్మ విడదీసింది. ఆఫ్ సైడ్ ఆడాలనుకున్న షఫాలీని తను క్లీన్‌బౌల్డ్ చేసింది.
Marizanne Kapp says that’s how you do it 😎@DelhiCapitals are back to winning ways 💙
A 7⃣-wicket victory over #MI 🥳
Updates▶️ https://t.co/GUiylordH6 #TATAWPL | #KhelEmotionKa | #DCvMI️ pic.twitter.com/ezuLsdAyk0
— Women’s Premier League (WPL) (@wplt20) January 20, 2026
ఆ తర్వాత లారా వొల్వార్డ్త్(17)తో కలిసి జెమీమా రోడ్రిగ్స్(51 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ నిర్మించింది. అయితే.. నాట్ సీవర్ ఓవర్లో లారా అనూహ్యంగా రనౌట్ కాగా జట్టును గెలిపించే బాధ్యత తీసుకుంది కెప్టెన్. బ్రంట్ ఓవర్లో సిక్సర్ బాదిన తను.. ఆపై మాథ్యూస్ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో ఢిల్లీని గెలుపు వాకిట నిలిపింది. 19వ ఓవర్ చివరి బంతికి మరిజానే కాప్(10 నాటౌట్) సిక్సర్ బాదగా ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.
దంచేసిన బ్రంట్, హర్మన్‌ప్రీత్
కీలకమైన పోరులో ముంబై ఇండియన్స్‌ను భారీ స్కోర్ చేయనివ్వలేదు ఢిల్లీ క్యాపిటల్స్. పవర్ ప్లేలోనే రెండు వికెట్లతో ముంబైకి షాకిచ్చినా.. నాట్ సీవర్ బ్రంట్(65 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్(41)లు మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యంతో ముంబైని ఆదుకున్నారు. శ్రీ చరణి(3-33) మూడు వికెట్లతో చెలరేగడంతో మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. అయితే.. చివరిదాకా నిలబడిన నాట్‌సీవర్.. సంస్కృతి గుప్తా(10 నాటౌట్) ఓవర్లలో 20 రన్స్ రావడంతో ముంబై స్కోర్ 150 దాటింది. ఒకేఒక విజయంతో అట్టడుగున నిలిచిన ఢిల్లీ విజయంతో సాధిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

