DCW vs MIW : డబ్ల్యూపీఎల్‌లో కీలకమైన పోరులో ముంబై ఇండియన్స్‌ను భారీ స్కోర్ చేయనివ్వలేదు ఢిల్లీ క్యాపిటల్స్. పవర్ ప్లేలోనే రెండు వికెట్లతో ముంబైకి షాకిచ్చినా.. నాట్ సీవర్ బ్రంట్(65 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్(41)లు మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యంతో ముంబైని ఆదుకున్నారు. శ్రీ చరణి(3-33) మూడు వికెట్లతో చెలరేగడంతో మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. అయితే.. చివరిదాకా నిలబడిన నాట్‌సీవర్.. సంస్కృతి గుప్తా(10 నాటౌట్) ఓవర్లలో 20 రన్స్ రావడంతో ముంబై స్కోర్ 150 దాటింది. ఒకేఒక విజయంతో అట్టడుగున నిలిచిన ఢిల్లీ విజయంతో సాధిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.
టాస్ ఓడిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం దక్కలేదు. కమలిని స్థానంలో హీలీ మాథ్యూస్(12)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన సంజీవన సంజన(9)ను నందిని శర్మ క్లీన్‌బౌల్డ్ ఓపెనర్‌గా వచ్చిన సంజీవన సంజన(9) పెద్ద షాట్ ఆడబోయి కాగా.. ఆ తర్వాతి ఓవర్లోనే మరినేకాప్ సంధించిన బంతి లెంగ్త్‌ను అంచనా వేయలేక మాథ్యూస్ బౌల్డ్ అయ్యింది. 21కే రెండు వికెట్లు పడిన దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(41), నాట్ సీవర్ బ్రంట్(65 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా చూసుకుంటూ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
How’s that for a finish! 💪
Sanskriti Gupta ends the @mipaltan innings in style with a MAXIMUM 🔥
Scorecard ▶️ https://t.co/GUiylorLwE #TATAWPL | #KhelEmotionKa | #DCvMI pic.twitter.com/6ANJVamkeK
— Women’s Premier League (WPL) (@wplt20) January 20, 2026
మూడో వికెట్‌కు 70ప్లస్ రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని శ్రీ చరణి(3-33) విడదీసింది. కౌర్ ఔటయ్యాక జోరు పెంచిన బ్రంట్ అర్ధ శతకం సాధించింది. అయితే.. 18వ ఓవర్లో నికోలా కారీ(12), అరుంధతి కౌర్(3)లను ఔట్ చేసిన చరణి ముంబై భారీస్కోర్ ఆశలపై నీళ్లు చల్లింది. కానీ, సంస్కృతి గుప్తా(10 నాటౌట్) ఆఖరి ఓవర్లో ఫోర్, సిక్స్ బాదడంతో ముంబై వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో మరినేకాప్(1-8), నందిని(1-36) చెరొక వికెట్ పడగొట్టారు.