Maoists | ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
లొంగిపోయిన మావోయిస్టుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరిపై రూ.64 లక్షల రివార్డు ఉన్నట్లుగా సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. ఇప్పటికైనా మావోయిస్టులు హింసాత్మక మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.