యాదాద్రి, ఫిబ్రవరి 19 : యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి దాతల విరాళాల వెల్లువ కొనసాగుతున్నది. శనివారం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌కు చెందిన దాత ఇట్టిరెడ్డి హనుమంత్‌రెడ్డి, జానాబాయి దంపతులు 250 గ్రాముల బంగారం సమర్పించారు. యాదాద్రి బాలాలయంలో ఆలయ ఏఈవోలు గజవెల్లి రమేశ్‌బాబు, గట్టు శ్రవణ్‌కుమార్‌కు బంగారాన్ని అందజేయగా వారికి ఆలయ అధికారులు రసీదు ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మచ్చ సత్యనారాయణ దంపతులు రూ.56 వేల విరాళం సమర్పించారు. ఇందుకు సంబంధించిన చెక్కును శనివారం బాలాలయంలో ఏఈవో రమేశ్‌బాబుకు అందజేశారు.