ఒడిశా మల్కాన్గిరి జిల్లాలో 22మంది నక్సలైట్లు మంగళవారం పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. సరెండర్ అయిన వాళ్లలో డివిజనల్ కమిటీ మెంబర్ మైరి మడ్కాం (45), బామన్ మడ్కాం(27), దంతేవాడకు చెందిన ఒక దళ కమాండర్ తదితరులు ఉన్నారని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.
కొత్తగూడెం ప్రగతి మైదాన్, డిసెంబర్ 23: ఒడిశా మల్కాన్గిరి జిల్లాలో 22మంది నక్సలైట్లు మంగళవారం పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. సరెండర్ అయిన వాళ్లలో డివిజనల్ కమిటీ మెంబర్ మైరి మడ్కాం (45), బామన్ మడ్కాం(27), దంతేవాడకు చెందిన ఒక దళ కమాండర్ తదితరులు ఉన్నారని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ఒడిశా డీజీపీ సమక్షంలో వారంతా లొంగిపోయారు.
తొమ్మిది మారణాయుధాలు, 150 రౌండ్ల తుపాకీ బుల్లెట్స్, 20 కిలోల పేలుడు పదార్థాలు, 13 ఐఈడీలను ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. లొంగుబాటుదారులకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న దానికంటే 10శాతం ఎక్కువ డబ్బు ఇస్తామని నవంబర్ లో ఒడిశా సర్కారు ప్రకటించింది.