CM KCR | కేసీఆర్ రోజువారీ షెడ్యూల్ ఎలా మొదలవుతుందో తెలుసా !
CM KCR Birthday | ఆయన మార్నింగ్ లేచి పేపర్లన్నీ జదవందె బయటికి రాడు. నాకు ప్రత్యేకంగ తెలుసుగద. మొత్తం న్యూస్ ఛానెల్స్ జూసి, పేపర్లు జదివి, బుక్స్ జదివి, అన్నీ తయారు జేసి, స్నానం జేసి, లంచ్ వరకు బయటికొస్తాడు.. కేసీఆర్ కొంత ఆలస్యంగా సందర్శకుల్ని కలుసుకుంటారని, లేటుగా నిద్రలేస్తారని అనుకునేవారికి ప్రొఫెసర్ జయశంకర్ ఇచ్చిన జవాబు ఇది.
కేసీఆర్ దినచర్య నిజానికి ఉదయం 4.30-5 గంటలకే మొదలవుతుంది. న్యూస్‌పేపర్లు ఇంకా స్టాండ్స్‌కు చేరీ చేరకముందే వాటిని చదవడానికి ఆయన తహతహలాడతారు. వివిధ దినపత్రికల్లో ముఖ్యమైన వార్తలు ఏమిటో తెలుసుకోవడానికి, సాధారణంగా సీఎంలు తమ ప్రెస్ సెక్రటరీల మీద ఆధారపడుతారు. కానీ కేసీఆర్ మాత్రం తానే స్వయంగా, క్షుణ్నంగా, ఆమూలాగ్రం చదువుతారు. ఆ సమయంలో ఎలాంటి డిస్ట్రబెన్స్నూ ఆయన సహించరు. ఫోన్‌కాల్స్‌ని అనుమతించరు. అంతగా పేరు, సర్క్యులేషన్ లేని పత్రికల్లో వచ్చే మంచి వార్తలను, వ్యాసాలను సైతం ఆయన గుర్తిస్తారు. బాగా ఇంప్రెస్ అయితే, ఆ కాలమిస్టు ఫోన్ నంబర్ తెప్పించుకుని, అతడి ఆలోచనా విధానం గురించి చర్చిస్తారు. ఇలా అనూహ్యంగా సీఎం ఫోన్, ఎర్రవెల్లి క్షేత్రానికి ఆహ్వానం అందుకున్నవారు ఎందరో ఉన్నారు. వార్తను వార్తగా కాకుండా, ఆ వార్త రాయడం వెనక ఉద్దేశాన్ని చదవడంలో కేసీఆర్ నిపుణుడు. పత్రికలు చదివిన తర్వాతే ఆరోజు షెడ్యూల్ ఖరారవుతుంది.
ఉద్యమాన్ని ప్రజల వద్దకు చేర్చిన ఘనత కళాకారులదే. ఎక్కడ తెలంగాణ సభలు జరిగినా కళాకారులు బస్సులు, బండ్లు, లారీలు అని చూడకుండా వెల్లువలా తరలివచ్చేవారు. కళాకారులు ఆకలి కడుపులతో, తినీతినక,అటుకులు బుక్కి పాటలు పాడి ప్రజల్లో చైతన్యం తెచ్చారు.
– కేసీఆర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
CM KCR | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
CM KCR| కేసీఆర్ దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే ఏంటి?
KCR | భక్తిభావంలో ఆయనకు ఆయనే సాటి.. జిల్లాలు, ప్రాజెక్టులకు దేవతల పేర్లు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

