NIMS Raids | నిమ్స్ ఆస్పత్రిలో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు
NIMS Raids | కింది స్థాయి ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారుల టీం నిమ్స్ ఆస్పత్రిలోని రికార్డ్లను తనిఖీలు చేసింది. మరోవైపు నిమ్స్ క్యాంటీన్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేశారు.
NIMS Raids | పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏకకాలంలో మూడు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారని తెలిసిందే. కాగా రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ శాఖల అధికారులు సుమారు 15 గంటలపాటు తనిఖీలు చేపట్టారు.
కాగా నిమ్స్ లో కింది స్థాయి ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. నిమ్స్‌లో స్కిల్డ్, నాన్ స్కిల్డ్ కలిపి మొత్తం 540 మంది ఉద్యోగులను నియమించగా.. నియామకాల్లో అక్రమాలు జరిగినట్టు ఏసీబీకి సమాచారం అందినట్టు తెలుస్తోంది. నియామక ప్రక్రియలో భాగంగా ఒక్కొక్కరి నుంచి రూ.60 వేలు నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారని.. ఇన్‌పేషంట్ల వద్ద డబ్బులు వసూలు చేసుకోవాలని.. జీతంతోపాటు నెలకు రూ.30 వేలకు సంపాదించుకోవచ్చని చెప్పినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలో ఏసీబీ చేపట్టిన సోదాల్లో సెక్యూరిటీ కాంట్రాక్ట్ టెండర్ వేయకుండా పాత సంస్థకే అప్పగించినట్టు గుర్తించింది.. నిమ్స్ అక్రమాల్లో లక్ష్మీ భాస్కర్ కీలక పాత్ర పోషించినట్టు ఏసీబీకి ఆధారాలు దొరికినట్టు సమాచారం.
రికార్డుల పరిశీలన..
తొలి రోజు ఏసీబీ అధికారుల టీం నిమ్స్ ఆస్పత్రిలోని రికార్డ్లను తనిఖీలు చేసింది. మరోవైపు నిమ్స్ క్యాంటీన్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేశారు. సర్జికల్ స్టోర్‌లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు సోదాలు నిర్వహించారు. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డీఎస్పీ లక్ష్మీ కాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారుల బృందం నిమ్స్ పరిపాలనా విభాగంలో రికార్డులను పరిశీలించింది. సర్జికల్ స్టోర్‌లో నలుగురు డ్రగ్ ఇన్స్పెక్టర్లు మందులు, వైద్య పరికరాల స్టోరేజీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
Read Also :
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Raids | నిమ్స్ ఆస్పత్రిలో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు
Killer | ‘కిల్లర్’ మూవీ రివ్యూ.. రూ.కోటి ఛాలెంజ్ విసిరిన సినిమా ఎలా ఉందంటే!
Fire accident | వైజాగ్ పోర్టు ట్రస్టులో భారీ అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది..!
Asthma | ఆస్తమా ఉన్నవారికి ఫ్లూ సమస్య వస్తే.. అది సాధారణం కాదు.. కచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే..
‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

