Gurugram | దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం అతలాకుతలం చేసింది. సోమవారం సాయంత్రం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. ముఖ్యంగా హర్యానా (Haryana) రాష్ట్రం గురుగ్రామ్ (Gurugram) నగరం అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. భారీ వర్షానికి ఢిల్లీ-గురుగ్రామ్ జాతీయ రహదారిపై దాదాపు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (traffic jams) తలెత్తింది. దీంతో వాహనదారులు రోడ్లపై ముందుకు కదల్లేక ఆరు గంటలపాటు నరకయాతన అనుభవించారు.
2 hours of rain = 20 KMs of Gurgaon Jam!
As CM Nayab Saini only flies in “State Helicopter” and doesn’t travel on “road”, this is a “helicopter shot” of Highway in Gurgaon just now.
So much for the rain preparedness and crores and crores of public money spent on drainage,… pic.twitter.com/HCNPYZkG2c
— Randeep Singh Surjewala (@rssurjewala) September 1, 2025
ఈ పరిస్థితిపై హర్యానాలో నయాబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) నేతృత్వంలోని బీజేపీ (BJP) ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రణాళిక లేని మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా నివాసితులు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రణదీప్ సింగ్ సుర్జేవాలా గురుగ్రామ్‌లో భారీ ట్రాఫిక్ జామ్‌కు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘2 గంటల వర్షం = 20 కిలోమీటర్ల గురుగ్రామ్ జామ్..!’ అంటూ నయాబ్ సింగ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇదీ బీజేపీ ట్రిపుల్ ఇంజిన్ మోడల్ అంటూ ఎద్దేవా చేశారు.
3 hours of rain and Gurugram is in complete chaos. People have been stranded in traffic for 5–6 hours.
This is the result of the BJP government’s incapability and failed planning. #Gurgaon #Gurugram #gurugramrain #GurgaonRains pic.twitter.com/Ltk8NBt7bm
— Kumari Selja (@Kumari_Selja) September 1, 2025
మూడు గంటలు పడిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మరికొంతమంది నాయకులు విమర్శించారు. నివాసితులు దాదాపు 5 నుంచి 6 గంటలు ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోయి నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ అసమర్థత, విఫల ప్రణాళిక ఫలితమే ఈ పరిస్థితికి కారణం అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
Yes Congress built it. But in the last 11 years BJP destroyed it. Painful. https://t.co/lO7Y4mIC3P
— Deepender Singh Hooda (@DeependerSHooda) September 1, 2025
Millennium city Gurugram.
A double engine sarkar with a double the failure track record. pic.twitter.com/iw4SU6Pspn— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) September 1, 2025
Also Read..
Uttarakhand | ఉత్తరాఖండ్‌కు రెడ్ అలర్ట్.. 10 జిల్లాల్లో పాఠశాలలు మూసివేత
AAP MLA | రేప్ కేసులో అరెస్ట్.. పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన ఆప్ ఎమ్మెల్యే
IndiGo | విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్