ముంబై : ఓబీసీ కేటగిరీలో మరాఠాలకు కోటా(Maratha Quota) ఇవ్వాలని కోరుతూ సామాజి కార్యకర్త మనోజ్ జరాంజే ముంబైలో నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. మనోజ్‌తో పాటు అతని బృందానికి మంగళవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆజాద్ మైదాన్‌ను విడిచి వెళ్లాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. నిరాహార దీక్ష ఇవాళ్టికి అయిదో రోజుకు చేరుకున్నది. నిరసన ప్రదర్శన కోసం కేవలం 5వేల మందికి పర్మిషన్ ఇవ్వగా, ముంబైలోని ఆజాద్ మైదాన్‌కు సుమారు 40 వేల మంది నిరసనకారులు చేరుకున్నట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. బాంబే హైకోర్టు మార్గదర్శకాలను బేఖాతరు చేయడం వల్ల ముంబై పోలీసులు ఇవాళ నోటీసులు ఇ్చారు. ముంబై వీదుల నుంచి మరాఠా కోటా మద్దతుదారులు వెళ్లిపోవాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. మరాఠా కోటీ ఉద్యమం వల్ల ముంబై నగరం స్తంభించిపోయినట్లు కోర్టు చెప్పింది. మంగళవారం మధ్యాహ్నం వరకు సిటీ మొత్తం క్లీన్ కావాలని కోర్టు ఆదేశించింది.