రాహుల్ వస్తేనే.. అపాయింట్మెంట్ ఇస్తరంట!
తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ (టీఎస్టీ), మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) పోస్టులకు అర్హత సాధించిన 196 మంది దాదాపు ఐదు నెలలుగా నియామకపత్రాల కోసం ఎదురుచూస్తున్నారు.
- ఆర్టీసీలో 5 నెలలుగా టీఎస్టీ, ఎమ్మెస్టీ అభ్యర్థుల ఎదురుచూపు
- సీఎంకు అభ్యర్థుల బహిరంగ లేఖ
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ (టీఎస్టీ), మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) పోస్టులకు అర్హత సాధించిన 196 మంది దాదాపు ఐదు నెలలుగా నియామకపత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రాజకీయ కారణాలతో అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వస్తున్నది.
ఈ కార్యక్రమ జాప్యంపై ఆరా తీయగా ఏఐసీసీ నేత తెలంగాణ పర్యటన షెడ్యూల్ విడుదలైతే.. రాహుల్ గాంధీతో నియామకపత్రాలు అందించే ఆలోచనలో ప్రభు త్వం ఉన్నట్టు తేలింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు, పోలీస్ వెరిఫికేషన్లాంటి అన్ని ప్రక్రియలు పూర్తయి నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమ వేదనను తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

