ఢిల్లీ యాత్ర.. కులానికో పాత్ర
ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన పార్టీ ధర్నా కోసం కాంగ్రెస్ కులసంఘాలకు ఎరవేస్తున్నది. జనసమీకరణ కోసం ఒక్కో సంఘానికి ఒక్కో తాయిలాన్ని ప్రకటిస్తున్నది. వారు కోరిన కోర్కెలు నెరవేర్చుతున్నది.
- కాంగ్రెస్ సర్కార్ మంత్రాంగం
- కులసంఘాలతో మంతనాలు
- ఎస్సీలో ఓ వర్గం కోసం మరోసారి జీవో
- ముదిరాజ్‌లకు గ్రూప్ డీ ఎర
- ఢిల్లీ ధర్నా కోసం పడరాని పాట్లు
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన పార్టీ ధర్నా కోసం కాంగ్రెస్ కులసంఘాలకు ఎరవేస్తున్నది. జనసమీకరణ కోసం ఒక్కో సంఘానికి ఒక్కో తాయిలాన్ని ప్రకటిస్తున్నది. వారు కోరిన కోర్కెలు నెరవేర్చుతున్నది. బస్సులతోపాటు చేతి ఖర్చులకు నిధులను సమకూర్చుతామని లాబీయింగ్ చేస్తున్నది. మరోవైపు కులసంఘాల తీరుపై బీసీ సంఘాల మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తీరు కులసంఘాలు, మేధావుల మధ్య చిచ్చురేపుతున్నది. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సమీక్ష (సర్)ను, ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నవంబర్ ఒకటిన భారీ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు రాష్ట్రం నుంచి భారీగా జనసమీకరణ చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలో కులసంఘాలతో మంతనాలు సాగిస్తున్నది.
తెలంగాణ బీసీ జాబితా నుంచి తొలగించిన ఏపీ భౌగోళిక ప్రాంతానికి 26 బీసీ కులాలను తిరిగి రాష్ట్ర బీసీ జాబితాలో చేరుస్తామని ఆయా సంఘాల ప్రతినిధులకు హామీనిచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా ముదిరాజ్ కులస్తులను బీసీ (డీ) గ్రూపు నుంచి బీసీ (ఏ) గ్రూపులో చేర్చుతామని సంబంధిత మంత్రి ద్వారా ఆయా కులాల ప్రతినిధులతో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ విషయం ప్రకటించారు.
బీసీ (ఏ) గ్రూప్‌లో చేర్చాలని కోరుతున్న సగర తదితర కులసంఘాల నేతలకు కూడా మాటిచ్చినట్టు తెలుస్తున్నది. ఇక ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత కూడా మరోసారి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. కులవృత్తుల ఆధునికీకరణ పేరిట ఉపకరణాల అందజేత, ఆత్మగౌరవ భవనాల ట్రస్ట్‌ల్లో కొన్ని సంఘాలకు అవకాశం కల్పిస్తామంటూ నజరానాలను ప్రకటించినట్టు తెలుస్తున్నది. ఇటీవల డీఎన్టీ (డీనోటిఫైడ్ ట్రైబ్స్) హోదా పొందిన పలు కులాలను సైతం సంప్రదించినట్టు సమాచారం. కులసంఘాల ప్రతినిధుల వ్యక్తిగత పనులను చక్కబెట్టడమే కాకుండా, జనసమీకరణ కోసం ప్యాకేజీలను ప్రకటిస్తున్నది.
ప్రభుత్వంతో అంటకాగుతూ..
కాంగ్రెస్ తీరు, కొన్ని కులసంఘాల నేతల వ్యవహారం ఇప్పుడు వారి మధ్య చిచ్చు రేపుతున్నది. ఇప్పటికే కులగణన, 42 శాతం రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ వంచించిన తీరుపై కులసంఘాలు, మేధావుల మధ్య పూడ్చలేని అగాథం ఏర్పడింది. వాస్తవంగా ఇంటింటి సర్వే, బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ అంశంపై ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, జారీచేసిన ఆదేశాల్లో అనేక లోపాలున్నాయని మేధావులు, నేతలు మొత్తుకున్నారు. అయినప్పటికీ పలు బీసీ, కులసంఘాల ప్రతినిధులు మాత్రం అవేవీ లేకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతునిస్తూ వచ్చాయి.
అవి అమలుకాకముందే ప్రభుత్వ పెద్దలను కలిసి సన్మానాలు చేస్తూ హంగామా చేశాయి. కార్పొరేషన్ల నియామకాల్లో, నామిటేడ్ పోస్టుల్లో బీసీలకు అన్యాయం చేసినా కూడా బీసీ సంఘాలు, పలు కులసంఘాలు నోరుమెదపలేదు. కేవలం ఉనికి కోసం, ప్రభుత్వ పెద్దల మెప్పు కోసమే కుట్రపూరితంగా వ్యవహరించాయని, బీసీ హక్కులను తాకట్టుపెడుతున్నారని, బీసీ మేధావులు, ఇతర బీసీ కులాల ప్రతినిధులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా ఢిల్లీ ధర్నా కోసం మరోసారి కాంగ్రెస్ కుల సంఘాలను వాడుకోవాలని తెరతీయడం, అందుకు పలువురు కులసంఘాల ప్రతినిధులు సైతం వంతపాడుతుండడంతో తీవ్ర వివాదం రేపుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

