146 మందిని రక్షించిన నేవీ
146 మందిని రక్షించిన నేవీ | తౌటే తుఫాను ధాటికి ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో రెండు ఓడలు కొట్టుకుపోయాయి. ఇందులో 410 మంది గల్లంతవగా.. ఇప్పటి వరకు 146 మందిని రక్షించినట్లు భారత నావికాదళం మంగళవారం తెలిపింది.

ముంబై : తౌటే తుఫాను ధాటికి ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో రెండు ఓడలు కొట్టుకుపోయాయి. ఇందులో 410 మంది గల్లంతవగా.. ఇప్పటి వరకు 146 మందిని రక్షించినట్లు భారత నావికాదళం మంగళవారం తెలిపింది. మిగతా వారిని సైతం రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నట్లు నేవీ పేర్కొంది. తౌటే అతి తీవ్ర తుఫానుగా మారగా.. భారీగా గాలులు వీశాయి. దీంతో ముంబై తీరంలో ఉన్న రెండు ఓడలు కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న నేవీ తన మూడు యుద్ధ నౌకలను మోహరించింది. ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎల్ తల్వార్ నౌకలతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. బార్జ్ పీ 305 నౌక నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 146 మందిని నేవీ రక్షించింది.
ఇందులో 111 మందిని ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్‌కతా, 17 మందిని ఆఫ్‌షోర్ సపోర్ట్ వెసెల్ (ఓఎస్వీ) గ్రేట్షిప్ అహిల్య, 18 మందిని ఓఎస్వి ఓషన్ ఎనర్జీ రక్షించాయి. 273 మందితో ఉన్న బార్జ్ పీ 305 నౌక సోమారం బొంబాయి హై ఏరియాలోని హీరా ఆయిల్ ప్రాంతం నుంచి సముద్రంలో కొట్టుకుపోయింది. మిగతా సిబ్బంది కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాలు రాత్రిపూట సైతం కొనసాగాయని నేవీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ప్రయత్నంలోనే ఐఎన్ఎస్ కోల్‌కతా లైఫ్ జాకెట్లతో ప్రాణాలతో బయటపడిన మరో ఇద్దరిని రక్షించిందని పేర్కొన్నారు. గాల్ కన్స్ట్రక్టర్కు చెందిన మరో బార్జ్ ముంబయి తీరంనుంచి కొట్టుకుపోగా.. ఇందులో అందులో 137 మంది సిబ్బంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
18-05-2021 మంగళవారం.. మీ రాశి ఫలాలు
టీకాతో సమస్యలు నామమాత్రం
నేడు పలు రాష్ట్రాల అధికారులతో ప్రధాని భేటీ
ప్రపంచ దేశాలకు 8 కోట్ల టీకా డోసులు : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం
ఐసీఎంఆర్ కీలక నిర్ణయం.. కొవిడ్ ప్రోటోకాల్ నుంచి ప్లాస్మా థెరపీ తొలగింపు
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో పదోసారి పెంపు..
రెజ్లర్ సుశీల్‌కుమార్‌పై రూ.లక్ష రివార్డు ప్రకటించిన ఢిల్లీ పోలీసులు
దేశంలో కరోనా మరణ మృదంగం.. 24గంటల్లో 4,329 మంది మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

