e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News Ap New Covid Cases | ఏపీలో 1,445 కరోనా కేసులు

Ap New Covid Cases | ఏపీలో 1,445 కరోనా కేసులు

అమరావతి : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,145 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. తాజాగా 1,243 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్‌ బారినపడి మరో 11 మంది ప్రాణాలు వదిలారు. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,33,419కి పెరిగింది. ఇప్పటి వరకు 20,04,786 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 14,030 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,603 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది.

24గంటల్లో 62,252 టెస్టులు నిర్వహించగా.. తాజాగా కేసులు నమోదయ్యాయని తెలిపింది. కొవిడ్‌తో కృష్ణాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, కర్నూల్‌, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కొత్త కేసుల్లో కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 271 మంది, చిత్తూరులో 201, కృష్ణాలో 164, గుంటూరులో 141, ప్రకాశంలో 136, పశ్చిమ గోదావరిలో 131, కడపలో 131, నెల్లూరులో 130 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్ష చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana