గౌహతి ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది మృతి
గౌహతి ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది మృతి | అసోంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది కొవిడ్ రోగులు మృతి చెందారు. గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్)లో ఈ ఘటన చోటు చేసుకుంది.

డిస్పూర్ : అసోంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది కొవిడ్ రోగులు మృతి చెందారు. గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్)లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రివేళ విధుల్లో ఉండాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడమే మరణాలకు కారణమని రోగుల బంధువులు ఆరోపించారు. మృతి చెందిన 12 మందిలో ఐసీయూలో ఉన్న తొమ్మిది మంది, వార్డులో ఉన్న ముగ్గురు రోగుల్లో ఆక్సిజన్ స్థాయిలు 90 శాతం కన్నా తక్కువగా ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ అభిజిత్ శర్మ మంగళవారం తెలిపారు. ఐసీయూలో ఉన్న రోగులకు కోమోర్బిడిటీస్ ఉన్నాయని, ఆక్సిజన్ స్థాయి అవసరమైన దానికంటే తక్కువ స్థాయికి పడిపోయి.. పరిస్థితి విషమించిన అనంతరం ఆలస్యంగా ఆసుపత్రికి వచ్చారని డాక్టర్ శర్మతెలిపారు.
వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా పరిస్థితిలో మెరుగుదల కనిపించలేదని చెప్పారు. మృతుల్లో ఎవరూ ఒక్క మోతాదు వ్యాక్సిన్ తీసుకోలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని కోరారు. ప్రాణనష్టం జరుగకుండా ఉండేందుకు సాధ్యమైనంత తర్వగా ఆసుపత్రి, కొవిడ్ కేర్ సెంటర్లో చేరాలని కోరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సుమారు 200 మంది వరకు ఉన్నారు. ఇదిలా ఉండగా.. విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి కేశబ మహంత ఆసుపత్రిని సందర్శించారు. పరిస్థితిపై సమీక్షించి, వైద్యులతో సమావేశమయ్యారు.
ఇవి కూడా చదవండి..
వృక్షాసనం వల్ల కలిగే ప్రయోజనాలు..
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
భారత్ బయోటెక్ చైర్మన్‌కు ‘వై’ కేటగిరి భద్రత
నేడు కేంద్ర కేబినెట్ భేటీ
భారత్ బయోటెక్‌తో బ్రెజిల్ ఒప్పందం నిలిపివేత!
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కొవాగ్జిన్ సమర్థవంతం : ఎన్ఐహెచ్
ఫ్లోరిడా : భవనం కూలి 12 మంది మృతి..149 మంది గల్లంతు
పిడుగులు పడి 11 మంది మృతి.. ఆరుగురికి గాయాలు
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 96.92శాతానికి రికవరీ రేటు
లోయలోపడిన వాహనం.. నలుగురు కార్మికుల దుర్మరణం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

