అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 1,178 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,23,242కు పెరిగింది. కొత్తగా 10 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13935కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో1,266 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 19,94,855 మంది బాధితులు కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 14,452 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో 54,970 కొవిడ్ టెస్టులు నిర్వహించగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,70,37,651 శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 204, నెల్లూరులో 177, గుంటూరులో 134, పశ్చిమ గోదావరిలో 124, ప్రకాశంలో 118 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.