భోపాల్ : మధ్యప్రదేశ్‌లో 10వ తరగతి విద్యార్థిని పరీక్ష కేంద్రం వాష్‌రూమ్‌లో ప్రసవించటం అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఇండోర్ జిల్లా బెత్మా ప్రాంతానికి చెందిన బాలిక మంగళవారం ధార్ జిల్లా పిథాంపూర్‌లో గణితం పేపర్ పరీక్ష రాసేందుకు రాగా ఈ ఘటన చోటుచేసుకుంది.
విద్యార్థినికి మధ్యలో తీవ్రమైన కడుపునొప్పి రావటంతో ఇన్విజిలేటర్ అనుమతితో వాష్‌రూమ్‌లోకి వెళ్లింది. అయితే, చాలా సేపటికి తిరిగి రాకపోవడంతోపాటు లోపలి నుంచి పసికందు ఏడుపు వినిపించటంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. తలుపులు తెరిచి చూడగా, విద్యార్థిని బిడ్డను ప్రసవించి ఉండటం చూసి నిశ్చేష్టులయ్యారు. తల్లీబిడ్డను హుటాహుటిన దవాఖానకు తరలించారు.