హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ( SCR ) పది ప్రత్యేక రైళ్లను ( Special Trains ) నడుపుతున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్( Hyderabad ) - విజయవాడ ( Vijayawada ) మధ్య 10 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వివరించారు.
ఈ రైళ్లు ఈనెల 11,12,13,18,19 తేదీల్లో ఉదయం 6 గంటలకు నడుస్తాయని తెలిపారు. ఈనెల 10,11,12,17,19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించారు.
ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉందని ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రిజర్వేషన్ చేసుకోని వారి కోసం రైలులో సగానికి పైగా జనరల్ బోగీలు వాడుకోవచ్చన్నారు.