Actor Vijay | ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan)కు కష్టాలు తప్పడం లేదు. సెన్సార్‌బోర్డు ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ విజయ్‌కి తమిళనాడు సీఎం స్టాలిన్ (CM Stalin) మద్దతుగా నిలవడం ఆసక్తికరంగా మారింది.
ఇదే సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఎన్డీయే ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని విమర్శించారు. ఈ జాబితాలోకి తాజాగా సెన్సార్ బోర్డు కూడా వచ్చి చేరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఎఫ్సీ (CBFC)ని కూడా ఆయుధంగా మార్చుకుంటోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్టాలిన్ పేర్కొన్నారు.
Also Read..
Dhandoraa OTT | ఓటీటీలోకి శివాజీ ‘దండోరా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Sreeleela | మలయాళ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సిగ్గుపడిన శ్రీలీల.. వీడియో
Mana Shankara Varaprasad Garu | తెలంగాణలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ టికెట్ రేట్ల పెంపు.. జీవో జారీ!