Sreeleela | టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం తన కోలీవుడ్ డెబ్యూ మూవీ ‘పరశక్తి’ (Parasakthi) ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ సరసన ఆమె నటించిన ఈ చిత్రం నేడు (జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం కేరళలోని కొచ్చికి శ్రీలీల వెళ్లగా.. అక్కడ జరిగిన ప్రెస్ మీట్లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఒక మలయాళ రిపోర్టర్ శ్రీలీలను ఫ్లర్ట్ చేస్తూ సరదాగా అడిగిన ప్రశ్నలు, దానికి ఆమె ఇచ్చిన క్యూట్ రియాక్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒక మలయాళ రిపోర్టర్ శ్రీలీలను పలకరిస్తూ మీకు తమిళం వచ్చా అని అడగగా, ఆమె అవును వచ్చు అని సమాధానమిస్తుంది. అనంతరం ఆ రిపోర్టర్ శ్రీలీల అందాన్ని పొగుడుతూ.. మిమ్మల్ని మొదటిసారి నేరుగా చూస్తున్నాను, మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా సిగ్గుపడుతూ నవ్వేశారు. అయితే వెంటనే ఆ రిపోర్టర్ ట్విస్ట్ ఇస్తూ.. మీరు నాకు ఒక సిస్టర్ (సోదరి) లాగా అనిపిస్తున్నారు అని అనడంతో, శ్రీలీల తనదైన శైలిలో.. తాను మెడికల్ స్టూడెంట్ అన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. నేను డాక్టర్‌ను, సిస్టర్ను (నర్సును) కాదు అంటూ చమత్కరించారు. శ్రీలీల ఇచ్చిన ఈ ఫన్నీ కౌంటర్‌తో అక్కడ నవ్వులు పూశాయి. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#Sreeleela‘s Fun Conversation a Malayalam reporter..😄
Reporter: “Romba alaga irukinga… but u r like a sister ..”😅 pic.twitter.com/XWFC9uMKJ9
— Laxmi Kanth (@iammoviebuff007) January 8, 2026