మోర్తాడ్ : కమ్మర్పల్లి మండలం ( Kammarpally mandal ) నాగపూర్ గ్రామంలో కుక్కలు దాడిలో ( Dog attacks ) పది మేకలు ( Goats ) మృతి చెందాయి. మరికొన్ని గాయాల పాలయ్యాయి. బాధితుడు బల మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి సమయంలో మేకల మందలోకి నాలుగు కుక్కలు వెళ్లి మేకలను గాయపరుస్తూ 10 మేకలను చంపేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరో 12 మేకలు తీవ్రంగా గాయపడ్డాయని అన్నారు.
కుక్కల బెడద ఉందని గతంలో అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు విలపించారు . అధికారులు నిర్లక్ష్యం వల్లే దాదాపు రూ. 2 లక్షలు నష్టపోయానని వెల్లడించారు. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ( KCR ) పుణ్యమా అని తనకు గొర్లు వచ్చాయని వాటిని పోషించుకుంటూ మందను తయారు చేసుకున్నానని తెలిపారు. కుక్కల దాడి కారణంగా వాటిని కోల్పోయానని వాపోయాడు. కుక్కల దాడిలో కోల్పోయిన మేకలకు నష్టపరిహారం అందించాలని, అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని కుక్కల బెడదను తొలగించాలని కోరారు.