దళితబంధు ఆస్తుల పంపిణీ పండుగలా జరిగింది. లబ్ధిదారులు తాము కోరుకున్న యూనిట్లు అందించడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకంతో నిరుపేద దళితులు యజమానులయ్యారు. రూ. 1.90 కోట్ల విలువైన యూనిట్లు అందుకొని సంబురపడ్డారు. ఇన్నాళ్లు కూలీలుగా పనిచేసిన తమను సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంతో ఓనర్లను చేసి జీవితా ల్లో కొత్త వెలుగునింపారంటూ ఆనందం వ్యక్తం చేశారు. గురువారం పరకాల నియోజకవర్గంలోని పర కాల, ఆత్మకూరు, దామెర, నడికూడ మండలాలకు చెందిన 19 మందికి రూ.10 లక్షల చొప్పున ట్రాక్టర్లు, డోజర్లను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అందించారు. దళితబంధు పథకం దేశానికే తలమానికంగా నిలు స్తుందని ఎమ్మెల్యే అభివర్ణించారు. దళితుల సమగ్రాభివృద్ధికే ఈ పథకం అమలు చేస్తున్నామని పేర్కొ న్నారు. సద్విని యోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.
పరకాల, మే 19: దళితబంధుతో కూలీలు ఓనర్లయ్యారు. యూనిట్లు తీసుకున్న లబ్ధిదారులు మురిసిపోయారు. ఇక తమ జీవితాలు మారిపోతాయని సంతోషం వ్యక్తం చేశారు. పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గంలోని పరకాల, ఆత్మకూరు, దామెర, నడికూడ మండలా లకు చెందిన 19 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, డోజర్లను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితుల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథ కం దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టి మరో అభినవ అంబేద్కర్గా నిలిచారని అన్నారు. దళితుల ను సమాజంలో ముందు వరుసలో నిలిపేందుకు సీఎం కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి ముందుగా 100 యూనిట్లను మంజూరు చేశారన్నారు. త్వర లోనే మరో 1500 యూనిట్లు మంజూరు కానున్నాయని తెలి పారు. దళిత బంధు లబ్ధిదారులు యూనిట్లను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.
లబ్ధిదారులు ఒకే రకమైన యూనిట్లను ఎంచుకోవడం వల్ల ప్రయోజనం ఉండ దని, పక్కా ప్రణాళి కతో లాభదాయక యూనిట్లను ఎంచుకో వాలని సూచించారు. నియోజకవర్గంలో 18వేలకు పైగా దళిత కుటుంబాలు ఉన్నాయని, విడుతల వారీగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి దళిత బంధు పథకం అందిస్తామని అన్నారు. దళిత బంధు అమలుతో విపక్షాల్లో వణుకు పుడుతోందని, పథకం ప్రారంభ సమయంలో దళితులను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారని, కానీ నేడు వారికి ఏం చేయాలో తెలి యక పిచ్చి కూతలు కూస్తున్నారని విమర్శించారు. దళితులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తుందని, ప్రభుత్వానికి వారు అండగా నిలువాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవిలత, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి, పీఏసీఎస్ చైర్మన్లు నల్లెల్ల లింగమూర్తి, గుండెబోయిన నాగయ్య, ఎంపీపీలు, జడ్పీటీసీలు, దళిత బంధు కమిటీ కోఆర్డినేటర్లు అధికారులు, టీఆర్ఎస్ నాయకు లు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌కు రుణపడి ఉంట..
దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్‌కు రుణ పడి ఉంట. ఈ పథకం ద్వారా నాకు ట్రాక్టర్ రావడం ఎంతో సంతోషం. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎప్పటికీ అండగా ఉంట.
– అల్లూరి మొగిలి, నడికూడ
దళితులను గుర్తించింది కేసీఆరే..
దళితులను గుర్తించింది సీఎం కేసీఆరే. దళితుల ఆర్థికా భివృద్ధి కోసం ఆనాడు అంబే ద్కర్ కృషి చేస్తే ఇప్పుడు ముఖ్య మంత్రి పాటుపడుతున్రు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి కృతజ్ఞతలు.
– బొచ్చు కరుణాకర్, పరకాల
సంతోషంగ ఉంది..
పదిహేనేండ్లుగా ట్రాక్టర్‌ను నడుపుతున్న. దళిత బంధు పథకంలో నేను డోజర్ తీసుకున్న. ఇది వచ్చుడు చాల సంతోషంగ ఉంది. ట్రాక్టర్ నడపడంలో నాకున్న అనుభవం తో మంచిస్థాయికి ఎదుగుత. నా కుటుంబం సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటది.
– దుప్పటి రవి, నడికూడ
దళితుల జీవితాల్లో వెలుగులు..
దళితబంధు పథకం దళితుల జీవి తాల్లో వెలుగు నింపుతాంది. దేశంల ఎక్కడ లేని విధంగా ఈ పథకాన్ని పెట్టిన సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ అండ గ ఉంట. దళితులకు మంచి పథకాలు అమలు చేస్తున్న ఈ ప్రభుత్వ రుణం తీర్చుకోలేనిది.
– వేల్పుల శ్రీనివాస్, దామెర మండలం
డ్రైవర్ నుంచి ఓనర్నయిన..
నేను ఏడేండ్లుగా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న. ఓనర్నవుతానని అనుకో లే. దళితబంధు పథకంతో ట్రాక్టర్‌కు ఓనర్నయిన. కష్టపడి ట్రాక్టర్‌ను నడు పుకుని మంచిస్థాయిలో ఉంట. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలకు రుణపడి ఉంట.
– కోగిల మహేందర్, ఆత్మకూరు
దళితులకు చేయూత..
సమాజంలో వెనకబడిన దళిత కు టుంబాలను ముందు వరుసలో నిలబె ట్టేందుకు దళితబంధు తోడ్పాటునంది స్తుంది. ఈ పథకం ద్వారా నాకు ట్రాక్ట ర్ వచ్చింది. దీన్ని మంచిగ వాడుకుని ఆర్థికాభివృద్ధిని సాధిస్తా.
– బొచ్చు వెంకటేశ్వర్లు, ఎస్సీ కాలనీ, పరకాల