మోర్తాడ్ : సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు ( Babli project ) నుంచి శనివారం 0.60 టీఎంసీల ( TMC ) నీటిని అధికారులు విడుదల చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఏటా మార్చి ఒకటిన తాగునీటి అవసరాల కోసం ఎగువకు ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. శనివారం జరిగిన నీటి విడుదల కార్యక్రమంలో ఈ ఈ యూజీడీ వెంకటేశ్వర్లు, ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ హైదరాబాద్ చక్రపాణి, నాందేడ్ డిప్యూటీ ఇంజనీర్ ప్రశాంత్ కదం, ఎస్సారెస్పీ ఏఈ కొత్త రవి, సచిన్దేవ్ కాంబ్లే, విన్యాస్, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.