బీజింగ్, అక్టోబర్ 3: భూతాపంతో నగరాలు వేగంగా వేడేక్కిపోతున్నాయ్. మెగాసిటీల్లో అయితే ఉపరితల ఉష్ణోగ్రత ఉడికిపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో దశాబ్దంలో సరాసరిన 0.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగింది. ఈ చేదు నిజాలు చైనాకు చెందిన నంజింగ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెలుగు చూశాయి. శాస్త్రవేత్తలు 2002-2021 వరకు ప్రపంచవ్యాప్తంగా 2 వేల నగరాల ఉష్ణోగ్రత డాటాను విశ్లేషించారు.