నర్సంపేటరూరల్/నెక్కొండ/దుగ్గొండి, మార్చి 5: నర్సంపేటలో శనివారం నిర్వహించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సభకు నర్సంపేట మండలంలోని 27 గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ మండల, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో నాయకులు బైక్‌లు, వాహనాల్లో ర్యాలీగా సభకు వెళ్లారు. ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ పాల్గొన్నారు. నర్సంపేటలో నిర్వహించిన మంత్రుల సభకు నెక్కొండ మండలం నుంచి టీఆర్ఎస్ శ్రేణలు భారీగా తరలివెళ్లారు.
ఎంపీపీ జాటోత్ రమేశ్, నెక్కొండ, రెడ్లవాడ సొసైటీల చైర్మన్లు మారం రాము, జలగం సంపత్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య ఆధ్వర్యంలో మండలంలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైక్‌లపై ర్యాలీగా తరలివెళ్లారు. సభకు తరలిన వారిలో నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, నాయకులు గుంటుక సోమయ్య, సూరం రాజిరెడ్డి, తాటిపెల్లి శివకుమార్, కొనిజేటి భిక్షపతి, మాదాసు రవి, కట్కూరి నరేందర్‌రెడ్డి, దేవనబోయిన వీరభద్రయ్య, రావుల భాస్కర్‌రెడ్డి, ఈదునూరి యాకయ్య, ఈదునూరి రమేశ్, ఈదునూరి వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు మహబూబ్ పాషా, బోంపెల్లి రాజేశ్వర్‌రావు ఉన్నారు.
టీఆర్ఎస్ దుగ్గొండి మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు వాహనాల్లో నర్సంపేటకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా గిర్నిబావిలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, నాయకులు పొన్నం మొగిలి, తోకల నర్సింహారెడ్డి, మేరుగు రాంబాబు, గుండెకారి రంగారావు, కంచరకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, నీలం పైడయ్య, సింగతి కార్తీక్, రజినీకర్‌రెడ్డి, ఉమేశ్‌రెడ్డి, శ్రీనివాస్, రాజు, సురేందర్‌రెడ్డి, సురేందర్ పాల్గొన్నారు.
పరకాల సభకు తరలిన నాయకులు
గీసుగొండ/సంగెం: పరకాలలో పట్టణంలో శనివారం జరిగిన మంత్రి హరీశ్‌రావు సభకు గీసుగొండ మండలంతోపాటు గ్రేటర్ వరంగల్ పరిధిలోని 15, 16వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. సుమారు ఐదు వేల మంది తరలివెళ్లినట్లు పార్టీ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, ఆర్బీఎస్ గ్రేటర్ గ్రామాల నాయకుడు గజ్జిరాజు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, కార్పొరేటర్ మనోహర్, నాయకులు శివకుమార్, రాజయ్య, శ్రీనివాస్‌రెడ్డి, వేణు, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే, సంగెం మండలంలోని టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. పరకాలలో 100 పడకల దవాఖాన శంకుస్థాపనకు మంత్రి హరీశ్‌రావు రావడంతో మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లి బహిరంగ సభలో పాల్గొన్నారు.