బషీరాబాద్, నవంబర్ 15: మండలంలోని కాశీంపూర్ యూపీఎస్ పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ రేపటి రథ సారథులు విద్యార్థులేనని అన్నారు. కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాస్పల్లి అంగన్వాడీ కేంద్రంలో..
దోమ, నవంబర్15: దేశ మొదటి ప్రధాని నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాస్పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం అంగన్వాడీ టీచర్ సావిత్రి చిన్నారులతో కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించింది.
విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారిన వేళ
పెద్దేముల్, నవంబర్ 15: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గోపాల్పూర్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీకాంత్ అన్నారు. సోమవారం గోపాల్పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని (స్వయం పరిపాలన దినోత్సవాన్ని) ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే టీచర్లుగా మారి వివిధ తరగతుల విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ నారాయణ, ఉపాధ్యాయులు నర్సింహులు, బం దెప్ప, సురేశ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
తాండూరులో..
తాండూరు, నవంబర్ 15: నెహ్రూ జయంతిని పురస్కరించుకొని సోమవారం తాండూరు పట్టణం, తాం డూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల పరిధిల్లోని విద్యాలయాల్లో స్వయం పరిపాలన (బాలల దినోత్సవ) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెహ్రూకు విద్యార్థులు గులాబీలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థుల వేషధారణ, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
సాల్వీడ్ ప్రాథమిక పాఠశాలలో..
కులకచర్ల, నవంబర్ 15: మండల పరిధిలోని సాల్వీడ్ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సతీశ్‌కుమార్, మండల పీఆర్టీయూ గౌరవాధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.