తిరుపతి : హోం మంత్రి అమిత్ షా సోమవారంతిరుపతిలోని కపిళేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న అమిత్ షాకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమిత్ షా ముందుగా వినాయకస్వామివారిని దర్శించుకుని కపిలేశ్వరం అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం కామాక్షి అమ్మవారిని, గురు దక్షిణామూర్తి స్వామివారిని, సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం చండీ హోమంలో పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్, ఈవో కలిసి స్వామివారి తీర్థప్రసాదాలను, టీటీడీ ముద్రించిన రూట్స్ అనే పుస్తకాన్ని , శ్రీవారి ప్రతిమను హోంమంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సీఎం.రమేశ్,సుజనా చౌదరి, బోర్డు సభ్యులు కృష్ణమూర్తి వైద్యనాథన్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కలెక్టర్ హరినారాయణన్, జేఈవో వీరబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.