కాచిగూడ,డిసెంబర్ 3: ఆరోగ్య తెలంగాణే సీఎం లక్ష్యం అని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నా రు. అంబర్‌పేట నియోజకవర్గం, గోల్నాక డివిజన్లోని కామ్‌గార్‌నగర్‌లో శుక్రవారం బస్తీ దవాఖానను డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల కోసం 355 బస్తీ దవాఖానల ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించగా ఇప్పటికే 226 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రోజు 32 బస్తీ దవాఖానలను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, పీఓ రజితారెడ్డి, ఎమ్మార్వో లలిత, టీఆర్ఎస్ నాయకులు దూసరి శ్రీనివాస్‌గౌడ్, భీమగౌని కృష్ణాగౌడ్, కొమ్ము శ్రీను, భరత్‌రాజ్‌ముదిరాజ్, పి.అంజయ్యచారి, ప్రభాకర్, ఆర్కె బాబు, నర్సింగ్‌యాదవ్, పల్లవి, పట్లూరి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
పేదల కోసం నాణ్యమైన వైద్య సేవలు..
పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన వైద్య సేవలను అందిస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో 7 బస్తీ దవాఖానలు అందుబాటులో ఉన్నట్లు.. త్వరలో మరో రెండు బస్తీ దవాఖానల ఏర్పాటుకు సన్నహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
బస్తీ దవాఖానలతో ఎంతో మేలు
చిన్న చిన్న రోగాలకు ప్రైవే టు దవాఖానలకు పోతే వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. బస్తీ దవాఖానలు అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరికీ ఎంతో మేలు జరుగుతున్నది. దీంతో ప్రజల దవాఖానల ఖర్చులు గనణీయంగా తగ్గాయి.
-ఎస్. శోభ (చెప్పల్‌బజార్)
సీఎంకు రుణపడి ఉంటాం
తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడం అభినందనీయం. అందుకు డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ప్రజలకు సీఎం కేసీఆర్ చేస్తున్న మేలుకు అందరం రుణపడి ఉంటాం.
-దుర్గయ్య (కామ్గార్నగర్)