పెద్దేముల్, డిసెంబర్ 2 : అంగన్వాడీ కేంద్రాలకు నెల నెలా సరుకులు పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్గో సేవలను అందుబాటులోకి తీసుకు రావడం అంగన్వాడీ టీచర్ల పాలిట వరంగా మారింది. గతంలో అంగన్వాడీ కేంద్రాలకు అం దించే సరుకులు ఐసీడీఎస్ గోదాంలలో నిల్వచేసి అక్కడి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల ద్వారా సరఫరా చేసేవారు. కానీ ఆర్టీసీ కార్గో సేవల ద్వారా నేరుగా సరుకులను అంగన్వాడీ కేంద్రాలకు అం దించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తద్వారా సరుకుల రవాణాలో అక్రమాలను నివారించ డంతో పాటు ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నది.
తాండూరు నియోజకవర్గంలో మొత్తం 11 అంగన్వాడీ సెక్టార్లు ఉండగా 279 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో పెద్దేముల్ మండలంలో రెం డు సెక్టార్లు పెద్దేముల్, మంబాపూర్లు ఉండగా రెండు సెక్టార్ల ఆధీనంలో మంబాపూర్లో 30, పెద్దేముల్లో 29 మొ త్తం 59 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 11 సెక్టార్లు ఉండగా అందు లో మండలంతో కలుపుకొని ఉన్న మంబాపూర్, పెద్దే ముల్, మంబాపూర్, మాణిక్ నగర్ సెక్టార్లకు డిసెంబర్ నెలకుగాను మొత్తం సుమారు 9 వేల 62 కిలోల బాలామృ తం, నూనె పాకెట్ల వచ్చాయి. అందులో 8 వేల 700 కిలోల బాలామృతం ప్యాకెట్లు, 362.7 కిలోల విజయ మంచినూనె ప్యాకెట్లు వచ్చాయి. వచ్చిన సరుకులను మొత్తం అన్ని సెక్టార్లలో ఆర్టీసీ కార్గో బస్సు ద్వారా ప్రతి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి కోటాను పంపిణీ చేస్తున్నారు. నేరుగా అంగన్వాడీ కేంద్రాలకే సరుకులు రావడంతో తమ ఇబ్బందులు దూరమవ్వడమే గాక రవాణా ఖర్చుల భా రం కూడా పూర్తిగా తగ్గిపోయిందని అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సమయానికి సరుకులు చేరుతున్నాయి
ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు పంపించడంతో సమయానుసారంగా చేరుతున్నాయి. హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరగానే ఐసీడీఎస్ సీడీపీవోలు మాకు సమాచారం ఇస్తారు. మేము స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు సమాచారం అందించడంతో వారు అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉండి సరుకులను తీసుకుంటారు. ఆర్టీసీ కార్గో సేవలు అంగన్వాడీలకు బాగా ఉపయోగపడుతున్నాయి.
-దశమ్మ, అంగన్వాడీ సూపర్వైజర్
ఇబ్బందులు తొలిగిపోయాయి
ఒకప్పుడూ సరుకులు తెచ్చుకోవాలంటే నానా ఇబ్బందులు పడేవారం దానికి తోడు రవా ణా ఖర్చులు కూడా అధిక మొ త్తంలో ఉండేవి. ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు పంపించడంతో రవాణా ఇబ్బందులు తీరడంతోపాటు, ఖర్చుల భారం కూడా పూర్తిగా తగ్గిపోయింది. సమయానికి సరుకులు అం దేలా చూస్తున్న ఉన్నతాధికారులకు, ఆర్టీసీ కార్గో సిబ్బందికి ధన్యవాదాలు.
సూపర్వైజర్ల సహకారంతో…
ఆర్టీసీ కార్గోలో విధులు నిర్వహిస్తున్నాను.అంగన్వాడీ కేంద్రాలకు కావాల్సిన సరుకులు సరఫరా చే యాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో మహేశ్వరం డిపో నుంచి వచ్చాను. స్థానికంగా ఉండే ఐసీడీఎస్ సూపర్వైజర్ల సహకారంతో సరుకులు పంపిణీ చేస్తున్నాను .నాకు అప్పగించిన రూట్లలో ప్రతి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అంగన్వాడీ టీచర్ల వేలి ముద్రలు తీసుకొని వారికి కేటాయించిన కోటా బాలామృతం, నూనె పాకెట్లను అందిస్తున్నాను.
-ఎం.సుదర్శన్, ఆర్టీసీ కండక్టర్,
మహేశ్వరం బస్ డిపో