బేగంపేట నాలా సరికొత్త హంగులు అద్దుకుంది. సుందరీకరణ పనుల్లో భాగంగా కంపుకొట్టే ఈ నాలాపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) రెయిన్ గార్డెన్‌ను నిర్మించింది. ఈ రెయిన్ గార్డెన్ నిర్మాణ పనులు పూర్తికావడంతో ఇప్పుడు బేగంపేట నాలా సుందరంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రెయిన్ గార్డెన్ ఫొటోలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (MAUD) ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ బుధవారం వాటిని ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో బేగంపేటలో నిర్మించిన రెయిన్ గార్డెన్ చూపురులను కట్టిపడేస్తుంది. చేయి తిరిగిన చిత్రకారుడు వేసిన అద్భుత కళాఖండంలా చూడముచ్చటైన ఆకృతి, సహజసిద్ధమైన అందాలతో కనువిందు చేస్తున్నది.@arvindkumar_ias @KTRTRS @trspartyonline @HMDA_Gov @HiHyderabad pic.twitter.com/KhyUmOKqC1
— Namasthe Telangana (@ntdailyonline) July 28, 2021