యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి పట్టు చీరలకు ప్రఖ్యాతి అని అందరికీ తెలిసిన విషయమే. టైండ్ డై ఇక్కత్ పట్టు చీరల ఉత్పత్తి కేంద్రంగా ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది. ఇక్కడి చేనేత కళాకారుల అద్భుత ప్రతిభతో సిల్క్ సిటీగా గుర్తింపు సాధించింది. ఆ ఊరికి సమీపంలోని ఈ విహంగ వీక్షణం చూస్తే ఆకు పచ్చని చీరను వేసి అవనితల్లికి చుట్టినట్టుంది కదూ. అటు నిండుకుండలాంటి చెరువు, ఇటు పచ్చని పొలాలు.. కొత్త తెలంగాణకు నిలువుటద్దం పడుతున్నాయి.
– గుజ్జ నరేశ్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, యాదాద్రి భువనగిరి జిల్లా