హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కేబీఆర్ పార్కులో 512 నెమళ్లు ఉన్నట్లు అటవీశాఖాధికారులు ప్రకటించారు. డిసెంబర్ 3న కేబీఆర్ పార్కు వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దక్కన్ బార్డర్స్ ఎన్జీవో, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ, వరల్డ్ వైల్డ్ ఫండ్ల సహకారంతో అధికారులు బుధవారం నెమళ్ల గణనను నిర్వహించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 3న అటవీ శాఖాధికారులు నెమళ్లను లెక్కిస్తున్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీసీఎఫ్ ఎంజే అక్బర్, డీఎఫ్వో జోజి, డీఎఫ్వో ఎఫ్ఎస్పీ హైదరాబాద్, రిటైర్డ్ డిప్యూటీ సీఎఫ్ శంకరన్, ఎన్జీవోలు, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ, వరల్డ్ వైల్డ్ ఫండ్ సంస్థలకు చెందిన 35 మంది సభ్యులు పాల్గొన్నారు.