afghanistan airport | ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. తాలిబన్ల ఆరాచక పాలనతో మళ్లీ చీకటి రోజులు వస్తున్నాయనే భయాందోళనలతో వేలాది మంది ఆఫ్ఘానిస్థాన్ వాసులు దేశం విడిచి వెళ్లేందుకు వలస దారి పడుతున్నారు. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు ఆఫ్ఘానిస్థాన్ ప్రజలు సోమవారం పోటెత్తారు. రద్దీ పెరగడంతో ఎయిర్‌పోర్టు గేట్లు మూసివేస్తే ప్రహారీ నుంచి పైకి దూకి, ఇనుప కంచెలను దాటుకొని మరీ ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించారు. కనిపించిన విమానం ఎక్కేశారు. విమానం గేట్లు కూడా మూసివేయడంతో.. తాలిబన్ల రాజ్యంలో మేము బతకలేం.. మమ్మల్నీ ఎలాగైనా ఈ దేశం నుంచి తీసుకెళ్లండి అంటూ విమానంపైకి ఎక్కి ఇలా కూర్చున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి