వృత్తి నిబద్ధతతకు ఇది నిదర్శనం. కరోనా వ్యాక్సిన్ వేసేందుకు ఒక మారుమూల గ్రామానికి వెళ్లాలి. కానీ అక్కడికి ఎలాంటి రవాణా సౌకర్యం లేదు.. ఏదో ప్రైవేటు వాహనంలో వెళ్దామంటే అది ఏడారి.. కానీ తన డ్యూటీ ప్రకారం ఆ గ్రామంలో వారికి వ్యాక్సిన్ వేయాలి. దీంతో ఇలా రాజస్థాన్‌కు చెందిన ఒక మహిళా ఆరోగ్య కార్యకర్త ఒంటెపై వెళ్లి వ్యాక్సిన్ వేసింది. కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.