ఈ ఫొటోలో ఉన్న బిల్డింగ్ చూశారా ! ఏదో లగ్జరీ అపార్ట్మెంట్లా కనిపిస్తుంది కదూ !! కానీ అది కమర్షియల్ అపార్ట్మెంట్ కాదు.. ఇండ్లు లేని పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూం కాంప్లెక్స్ ఇది. హైదరాబాద్లోని సైదాబాద్ మండలం పిల్లిగుడిసెలలో నిర్మించిన ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు.. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.