CM KCR Birthday Special | సీఎం కేసీఆర్‌పై గుండెల్లో దాచుకున్న అభిమానాన్ని తన కుంచెతో ఆవిష్కరించాడు హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌కు చెందిన నెయిల్ ఆర్టిస్ట్ నరహరి మహేశ్వరం. కరోనా సమయంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పాలన్న సంకల్పంతోనే ఈ చిత్రాలను గీసినట్టు వివరించాడు. కాగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా సైకతశిల్పి మానస్ ఒడిశాలోని పూరీ సముద్రతీరంలో కేసీఆర్ సైకత శిల్పాన్ని రూపొందించారు. కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో ప్రత్యేక బహుమతిగా దీనిని తయారుచేయించినట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.