న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్ సిబ్బందిలో 600 మందిని తొలగించిందని బాధిత ఉద్యోగులు వెల్లడించారు. వ్యాపారంలో వృద్ధి రేటు పడిపోవడం, క్విక్ కామర్స్ విభాగమైన బ్లింక్ఇట్లో నష్టాలు రావడంతో ఆ కంపెనీ ఈ చర్యలకు పాల్పడినట్టు తెలుస్తున్నది. కృత్రిమ మేధను విరివిగా ఉపయోగించడం కూడా ఉద్యోగాల కోతకు ఒక కారణంగా తెలుస్తున్నది. అయితే ఉద్యోగుల తొలగింపుపై జొమాటో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిరుడు కస్టమర్ సపోర్ట్ రోల్స్, సేల్స్, ఆపరేషన్స్ తదితర అవసరాల కోసం జొమాటో 1500 మంది ఉద్యోగులను ఒక సంవత్సరానికి గాను కాంట్రాక్ట్ ప్రతిపాదికన నియమించుకొంది. ఇందులో చాలా మందికి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఒక నెల జీతం ఇచ్చి తొలగించినట్లు సమాచారం.