Zika Vvirus | అహ్మదాబాద్, నవంబర్ 7: గుజరాత్లోని ఓ వ్యక్తికి జికా వైరస్ సోకిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఆ వ్యక్తి వైరస్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, దీంతో అతడ్ని వారం రోజుల క్రితం దవాఖాన నుంచి ఇంటికి పంపించినట్టు గుజరాత్ ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది.
అయితే, సదరు రోగి విదేశాలకు వెళ్లలేదని, అతడికి వైరస్ ఎలా సోకిందన్నదానిపై స్పష్టత లేదని అధికారులు చెప్పారు.