Union Minister Dharmendra Pradhan | వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే వివిధ విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల్లో సంస్కరణలు తీసుకొస్తున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ‘జీరో ఎర్రర్’ ప్రవేశ పరీక్షల నిర్వహణలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. వైద్య విద్యా కోర్సులతోపాటు పేరొందిన ఇంజినీరింగ్ సంస్థల్లో బీటెక్ లేదా బీఈ కోర్సుల్లో ప్రవేశానికి ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)పై ఏర్పాటు చేసిన రాధాకృష్ణన్ కమిటీ నివేదిక అందజేసిందన్నారు.
ఎన్టీఏలో సంస్కరణల కోసం రాధాకృష్ణన్ కమిటీ సిఫారసులను అమలు చేసేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. జీరో ఎర్రర్’తో ప్రవేశ పరీక్షల నిర్వహణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. నీట్, నెట్ పీహెచ్డీ ప్రవేశ పరీక్షల నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకోవడంతో కేంద్రం ఇస్రో మాజీ చైర్మన్ కే చంద్రశేఖరన్ సారధ్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. నీట్ పీజీ, సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ పరీక్షలను చివరి క్షణంలో కేంద్రం వాయిదా వేసింది.