అమరావతి: డీలిమిటేషన్ ద్వారా సీట్లు తగ్గి ఏ రాష్ర్టానికీ నష్టం జరగకుండా చూడాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన జేఏసీ సమావేశానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్, పార్టీ నేతలు హాజరు కాలేదు. అయితే ఆయన డీలిమిటేషన్‌కు సంబంధించి ప్రధానిని ఉద్దేశిస్తూ రాసిన లేఖను విడుదల చేశారు.
‘గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ర్టాల జనాభా తగ్గింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిపితే సీట్లు తగ్గుతాయన్న చర్చ దక్షిణాది రాష్ర్టాల్లో జరుగుతున్నది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఇది లేకుండా చూడండి’ అని కోరారు. డీలిమిటేషన్ సమస్య దేశంలోని రాజకీయ, సామాజిక సామరస్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు.