Comedian Devraj | ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబ్ కమెడియన్ దేవరాజ్ పటేల్ తెలిబంధ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లభండి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అదుపుతప్పి వేగంగా వచ్చిన లారీ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో దేవరాజ్ పటేల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సీఎం భూపేష్ బఘేల్‌తో భేటీ సందర్భంగా పటేల్ వీడియో రూపొందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడు.
దేవరాజ్ పటేల్ ప్రసిద్ధ యూట్యూబర్ భువన్ బామ్‌తో కలిసి 2021 సంవత్సరంలో కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ధింధోరాలో పని చేశాడు. యూట్యూబర్ మృతిపై సీఎం భూపేష్ బఘెల్ ప్రగాఢ సంతాపం పేర్కొన్నాడు. ‘దిల్ సే బడా లగ్తా హై’తో కోట్లాది మంది ప్రజల్లో తన స్థానాన్ని సంపాదించుకున్న దేవరాజ్ పటేల్ మనందరినీ విడిచి వెళ్లిపోయారని ట్వీట్ చేశారు. చిన్న వయసులోనే అద్భుత ప్రతిభావంతున్ని కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పాడు. అతని మరణాన్ని తట్టుకునే శక్తి కుటుంబీకులకు, ఆత్మీయులకు ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.