Reels Craze | ప్రస్తుత సమాజంలో రీల్స్ (Reels) ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్ ఫోన్లు ఉండటంతో.. రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోవాలని చూస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను విచ్చల విడిగా వాడేసుకుంటున్నారు. ఎక్కడున్నాం.. ఏం చేస్తున్నాం..? అవేవీ పట్టించుకోకుండా ప్రాణాలకు తెగించి ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హైలెట్ అవడానికి రీల్స్ (Reels) చేస్తూ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు రీల్స్ పిచ్చితో రైలు కింద పడుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొత్వాలి (Kotwali) ప్రాంతంలో అజయ్ రాజ్బర్ (Ajay Rajbar) అనే యువకుడు రీల్స్ పిచ్చితో ఊహించని సాహసానికి పాల్పడ్డాడు. ప్రాణాలకు తెగించి వేగంగా వస్తున్న రైలు కింద పట్టాల మధ్యలో పడుకొని (Youth Lies Down Under Train) వీడియో చిత్రీకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వైరల్ వీడియోపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. అజయ్ రాజ్బర్ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
రీల్స్ పిచ్చితో ట్రైన్ కింద పడుకున్న యువకుడు
వైరల్ అవ్వడంతో అరెస్టు చేసిన పోలీసులు
యూపీ రాష్ట్రంలోని కొత్వాలీ ప్రాంతంలో రీల్స్ మోజులో వేగంగా వస్తున్న రైలు కింద పడుకుని వీడియో చికిత్రీకరించిన అజయ్ రాజ్బర్ అనే యువకుడు
రీల్ వైరల్ అవ్వడంతో యువకుడిని అదుపులోకి తీసుకుని రిమాండుకు… pic.twitter.com/eegsjhehPe
— Telugu Scribe (@TeluguScribe) December 30, 2025
Also Read..
Amit Shah | చొరబాట్లతో బెంగాల్ ప్రజల్లో ఆందోళన.. మమతా ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన అమిత్ షా
Air India Express Pilot: అటాక్ కేసులో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పైలట్ అరెస్టు, రిలీజ్
Multi Vehicle Collision | పొగమంచుతో ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు